53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు | Corona Virus Exceeding 53 Lakhs In AP | Sakshi
Sakshi News home page

53 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Sep 24 2020 6:12 AM | Updated on Sep 24 2020 6:12 AM

Corona Virus Exceeding 53 Lakhs In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 53,02,367 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. తాజాగా 72,838 టెస్టులు చేయగా, ఇందులో 7,228 కేసులు పాజిటివ్‌గా తేలాయి. 8,291 మంది కోలుకున్నారు. కోవిడ్‌–19 వల్ల మరో 45 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,506కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 6,46,530 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వీరిలో 5,70,667 మంది కోలుకున్నారు. మరో 70,357 మంది చికిత్స పొందుతున్నారు.  రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 99,295 టెస్టులు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement