
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్‌లో కన్వేయర్ బెల్ట్‌ను (conveyor belts) ఆగంతకులు కట్ చేశారు. కన్వేయర్ బెల్ట్‌లు ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గు, ఐరన్ ఓర్ వంటి ముడి సరకులను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కన్వేయర్ బెల్ట్ కట్ చేయడంతో ముడిసరుకు రవాణా నిలిచిపోయింది. కన్వేయర్ బెల్ట్‌ను ఉద్దేశపూర్వకంగా కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.