
కడప జిల్లా: భూ తగాదా విషయంలో యువకుడి బొటనవేలు కానిస్టేబుల్ కొరికేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. వీరబల్లి మండలం ఈడిగపల్లిలో నివాసముంటున్న వీరబల్లి దయానందం కుమారుడు వేంకటేశ్వర్లు ప్రస్తుతం విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరబల్లి శివకుమార్ కుమారుడు వినోద్ కుమార్‌తో వీరికి భూమి తగాదా ఉంది.
శుక్రవారం ఈ విషయపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో వినోద్‌కుమార్ బొటనవేలును వేంకటేశ్వర్లు కొరికేయగా, అతడి కుమారుడు వినయ్ వినోద్ కుమార్ కారును పగులగొట్టారు. ఈ సంఘటనపై వినోద్‌కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.