అరకును వణికిస్తున్న చలిగాలులు | Sakshi
Sakshi News home page

అరకును వణికిస్తున్న చలిగాలులు

Published Sat, Dec 16 2023 6:09 AM

Cold intensity increases in Alluri Sitaramaraj district: ap - Sakshi

అల్లూరి సీతారామరాజు జిల్లాను చలిగాలులు వణికిస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి.

శుక్రవారం అరకు లోయలోని కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయం వద్ద 10.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 11.8, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)

Advertisement
 
Advertisement