ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం జగన్‌ కడప పర్యటన

CM YS Jagan YSR Kadapa Visit On July 8th And 9th - Sakshi

బద్వేలు అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8, 9వ తేదీల్లో జిల్లా పర్యటనకు రానున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం బద్వేలులోని పలు ప్రాంతాలను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ సి.హరికిరణ్, మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక బైపాస్‌రోడ్డులోని బహిరంగ సభ స్థలాన్ని, హెలిప్యాడ్‌కు సంబంధించి సిద్దవటంరోడ్డులోని ఓ స్థలాన్ని, మైదుకూరురోడ్డులోని ఓ స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బద్వేలు పర్యటనకు రానున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బద్వేలుకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు.  

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు:
ఈ నెల 8, 9వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. కార్యక్రమంలో జేసీలు గౌతమి, ధర్మచంద్రారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్, అడా చైర్మన్‌ సింగసానిగురుమోహన్, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కె.రమణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గోపాలస్వామి, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జిలు సుందర్‌రామిరెడ్డి, యద్దారెడ్డి, పుత్తాశ్రీరాములు, బంగారుశీనయ్య, నారాయణరెడ్డి, పోలిరెడ్డి, మండల కనీ​నర్‌ బోడపాటిరామసుబ్బారెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, ఈఈ ప్రభాకర్‌నాయుడు, డీఈ రమేష్‌, మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్, తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ కె.వి.కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  


ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top