వైఎస్సార్‌ జిల్లాకు బయలుదేరిన సీఎం జగన్‌ | CM YS Jagan YSR District Tour | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్‌

Sep 1 2020 4:28 PM | Updated on Sep 1 2020 9:01 PM

CM YS Jagan YSR District Tour - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి  సాయంత్రం 4. 45గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement