Breadcrumb
Live Updates
తిరుపతి పర్యటనలో సీఎం జగన్
కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తాం: సీఎం జగన్
రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, మూడు ప్రాజెక్ట్లను ప్రారంభించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీసీఎల్ ద్వారా 2వేల మందికి, ఫాక్స్ లింగ్ ద్వారా 2 వేల మందికి, సన్నీ ఆప్కోటెక్ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ అన్నారు.
సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన సీఎం జగన్
తిరుపతి: సన్నీ ఆప్కోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కెమెరా లెన్స్.. సన్నీ ఆప్కోటెక్ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది.
2023 సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి..
శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులో వస్తుంది. 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయి' అని తెలిపారు.
అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన
ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన.
అపాచీ పరిశ్రమలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు వంటి ఉత్పత్తులు.
మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి.
అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15 వేల మందికి ఉపాధి.
వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న సీఎం జగన్
వకుళామాత ఆలయంలో సీఎం జగన్
ఆలయ ఆవరణలో మొక్క నాటిన సీఎం జగన్
వకుళామాత ఆలయ ఆవరణలో మొక్కనాటిన సీఎం జగన్. తిరుపతిలో వకుళామాత ఆలయాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్. సీఎం జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు.
వకుళామాత ఆలయంలో సీఎం జగన్
తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్. శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొననున్న సీఎం జగన్.
కాసేపట్లో వకుళామాత ఆలయానికి సీఎం జగన్
పూర్ణాహుతిలో పాల్గొని వకుళామాతను తొలి దర్శనం చేసుకోనున్న సీఎం జగన్
రేణిగుంట ఎయిర్పోర్ట్లో సీఎం జగన్కు సాదర స్వాగతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట ఎయిర్పోర్ట్లో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రార్డె, జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం జగన్కు స్వాగతం పలికారు.

శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్
తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో పాల్గొంటారు. పలు పరిశ్రమ యూనిట్ల నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటన లో భాగంగా పలు పరిశ్రమలు ప్రారంభించనున్నారు. శ్రీకాళహస్తి లోని ఇలగనూరులో అపాచి పాదరక్షలు తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
తిరుపతి బయల్దేరిన సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరిన సీఎం జగన్.
Related News By Category
Related News By Tags
-
ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ పరామర్శ
ఆలూరు రూరల్: హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్...
-
హంపి, అర్జున్లకు వైఎస్ జగన్ అభినందనలు
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్-2025లో కాంస్య పతకాలు గెలిచిన ఇరిగేశి అర్జున్, కోనేరు హంపిలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. వారి దృఢ సంకల్పం, ఆటతీరు, పోరాట స్ఫూర్తి అందరికీ గర్వకా...
-
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడంపైనా విచారం వ్య...
-
పునర్వి‘భజన’లో రాజకీయ కుతంత్రం
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన చేస్తున్నారు. ప్రజల, పాలనా సౌలభ్యాలకు తిలోదకాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక శాస్త్రీయ ప్రాతిపదికన ఏర్పాటైన జిల...
-
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చే...


