వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచాలి: సీఎం జగన్‌‌ | CM YS Jagan Review Meeting On COVID Vaccination Process | Sakshi
Sakshi News home page

కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రణాళికపై సీఎం జగన్ సమీక్ష‌

Mar 24 2021 4:24 PM | Updated on Mar 24 2021 8:57 PM

CM YS Jagan Review Meeting On COVID Vaccination Process - Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగైదు వారాల్లో కోటి మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి అర్భన్‌ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. రూరల్‌ ఏరియాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా.. మండలంలో వారానికి 4 రోజులు, రోజుకు 2 గ్రామాల చొప్పున వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం తెలిపారు. 

లోపాలు సరిదిద్దిన తర్వాత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని ఈ ఎన్నికలు పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లమన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీని వల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోందని, ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

చదవండి: 
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌.. 100 రోజుల ప్రచారం
'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుంది'

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement