సీఎం జగన్‌ చిత్రపటానికి జ్యూరీ అవార్డు 

CM YS Jagan Portrait Selected For Special Jury Award - Sakshi

అచ్చంపేట(పెదకూరపాడు): ఏపీ క్రియేటివిటీ అండ్‌ కల్చరల్‌ కమిషన్, క్రియేటివ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చిత్ర కళా పోటీల్లో అచ్చంపేటలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆర్ట్స్‌ ఉపాధ్యాయుడు కంచర్ల శివనాగ ప్రసాద్‌ వేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటం జ్యూరీ అవార్డుకు ఎంపికైంది.

కాగా పాఠశాల విద్యార్థులు వేసిన చిత్రాలకు బంగారు, రజిత పతకాలను సాధించగా, 15 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు వచ్చాయి. శివనాగప్రసాద్‌ను సోమవారం పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు చేతులమీదుగా అందుకున్నట్లు ఆయన వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top