వంగపండు ఉషకు సీఎం జగన్‌ పరామర్శ

CM YS Jagan Phone Call To Vangapandu Prasada Rao Daughter Usha - Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రముఖ విప్లవ కవి,  ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుమార్తె వంగపండు ఉషను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. వంగపండు మృతితో ఓ ప్రజా గాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, వంగపండు ఉష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ, కల్చరల్‌ కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో వంగపండు ప్రసాదరావు మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
(ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top