31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన.. బహిరంగ సభ.. అప్‌డేట్స్‌

Published Fri, Feb 23 2024 10:42 AM

CM YS Jagan Ongole Tour And Public Meeting Updates - Sakshi

CM Jagan Public Meeting At Ongole Updates

ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగిసిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

ఒంగోలు చరిత్రలో సువర్ణాధ్యాయం

 • 21 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ 
 • అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలతో భూ బదిలీ పత్రం అందజేసిన సీఎం జగన్‌
 • నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం
 • ఇది దేశంలోనే ఒక చరిత్ర: సీఎం జగన్‌
 • పేదరికం నుంచి పేదలు బయటపడాలి: సీఎం జగన్‌
 • ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్‌ కూడా చేస్తున్నాం: సీఎం జగన్‌
 • ఈ స్థలాలపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు
 • గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సర్టిఫైడ్‌ కాపీలు తీసుకోవచ్చు
 • రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు
 • ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నాం
 • అక్కచెల్లెమ్మలను లక్షాధికారుల్ని కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం

వాళ్లు సిద్ధంగా లేరంట!: సీఎం జగన్‌ చురకలు

 • చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి
 • మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు
 • కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు
 • చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు
 • చంద్రబాబు మాదిరి నాన్‌ రెసిడన్స్‌ ఆంధ్రాస్‌ మద్దతు నాకు లేదు
 • బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు
 • నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని
 • మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి

చంద్రబాబు దుర్మార్గం ఏపాటిదంటే.. 

 • చంద్రబాబు రాజకీయ రాక్షసుడు
 • వంద సినిమాల విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ
 • ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేయించాడు
 • తన హయాంలో సెంటు భూమి కూడా ఇవ్వలేదు
 • ఆ కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం
 • అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందట!
 • ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అన్నాడు
 • చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు
 • నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు


ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

 • గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు
 • మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు
 • గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి
 • పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు

ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

 • అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం
 • మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది
 • పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం
 • ఆర్థిక అంతరాలు తొలగించాం
 • రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు
 • భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదు
 • రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు
 • గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్‌ కాపీలు

ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

 • గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు
 • మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు
 • గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి
 • పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు
   

ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

 • అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం
 • మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది
 • పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం
 • ఆర్థిక అంతరాలు తొలగించాం
 • రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు
 • భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదు
 • రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు
 • గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్‌ కాపీలు


ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

 • వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
 • పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాం
 • చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
 • ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం
 • ప్రొసీజర్స్‌ను 3,300కు పెంచాం
 • పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్‌
 • రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా
 • పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం


పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య

 • పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం
 • ఇంగ్లీష్‌, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నాం
 • ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం
 • కార్పొరేట్‌ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు
   

ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

 • ఒంగోలు నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం
 • పేదల కోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశాం
 • 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచి కోసమే వేశాం
 • పాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
 • ఇంటింటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం
 • ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నాం
 • పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం
 • దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 
 • చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నాం. 
 • ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. 

మాజీ మంత్రి బాలినేని ప్రసంగం

 • పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టుకు వెళ్లారు?
 • పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదు
 • టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా?

ఒంగోలులో సీఎం జగన్‌..

 • ఎన్‌.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
 • జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్‌
 • సీఎం జగన్‌ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు

ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన
 

ఒంగోలులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

 • జగనన్న పాలనలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు
 • కాసేపట్లో ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమం
 • బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌
 • లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత
 • సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

సాక్షితో.. మాజీ మంత్రి బాలినేని 

ఒంగోలు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

 • కాసేపట్లో పేదలకు ఇళ్ల పట్టా పంపిణీ
 • 21 వేలమంది అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయనున్న సీఎం జగన్‌
 • ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభం
   

► కాసేపట్లో ఒంగోలుకు చేరుకోనున్న సీఎం జగన్‌


సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన

 • ప్రకాశం జిల్లా ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి
 • కాసేపట్లో‌ ఎన్.అగ్రహారం చేరుకోనున్న సీఎం జగన్‌
 • 21వేల మంది అక్కచెళ్లెమ్మలకు ఇళ్లపట్టాలు పంపిణీ
 • సీఎం జగన్‌ చేతుల మీదుగా ఒంగోలు మంచినీటి పథకం పనులు ప్రారంభం

ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం 

పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది.  దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది.


20,840 మంది అక్కచెల్లెమ్మలకు

సీఎం జగన్‌ చేతుల మీదుగా.. ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేసిన కన్వేయన్స్‌ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్‌ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు.   

సచివాలయాల్లో సర్టిఫైడ్‌ కాపీ 
ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్‌ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది.

ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్‌ డీడ్‌లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేస్తోంది. ఈ డీడ్‌లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్‌ డీడ్‌లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 

విలువైన స్థిరాస్తి.. 
ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది.

మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది.

17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్‌ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్‌గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు.

Advertisement
Advertisement