ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్‌

CM YS Jagan Mohan Reddy Kurnool Visit Live Updates - Sakshi

01:20PM
కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్‌ పాఠశాలలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

10:00AM
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలు రానున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి వివాహానికి హాజరుకానున్నారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్‌ పాఠశాలలో వివాహ వేడుక ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీఎం హాజరవుతుండటంతో ప్రొటోకాల్‌ ప్రకారం పోలీసులు, అధికారులు భద్రత, ఇతర ఏర్పాట్లను చేపట్టారు. బుధవారం ఉదయం 10.20 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

అక్కడ 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొని 12.15 గంటలకు తిరిగి బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌ కోటేశ్వరరావు, కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు డాక్టర్‌ మనజీర్‌ జిలానీ, ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, నారపురెడ్డి మౌర్య, మునిసిపల్‌ కమిషనర్‌ డీకే బాలాజీ, డీఆర్వో బి.పుల్లయ్యలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సీఎం ఓర్వకల్లు చేరుకున్నప్పటి నుంచి వివాహంలో పాల్గొని తిరిగి వెళ్లే వరకు పటిష్ట బందోబస్తుతోపాటు ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. ఆయా అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.  

09:50AM
సీఎం పర్యటనకు పటిష్ట భద్రత  
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి తగిన సూచనలు (బ్రీఫింగ్‌) ఇచ్చారు. ఓర్వకల్లు విమానాశ్రయం, కర్నూలు మండలం పంచలింగాల గ్రామ శివారులోని మాంటిస్సోరి స్కూల్‌ సమీపంలోని హెలిప్యాడ్‌ నుంచి వివాహ వేడుక వరకు గల రూట్‌ అండ్‌ రూఫ్‌ టాప్‌ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించే పోలీసులు, స్పెషల్‌పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

బందోబస్తుకు పోలీసు నిఘా విభాగాలు ఇంటలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ), మఫ్టీ  బృందాలతో పాటు 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 55 మంది ఎస్‌ఐలు, 88 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 241 మంది కానిస్టేబుళ్లు, 29 మంది మహిళా పోలీసులు, 163 మంది హోంగార్డులు, 4 ప్లటూన్ల ఏఆర్‌ సిబ్బంది, 15 స్పెషల్‌ పార్టీ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బందిని  కేటాయించారు.       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top