సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో పూజరి శైలజకు న్యాయం

CM YS Jagan Job Given To Weightlifter Pujari Shailaja - Sakshi

కరణం మల్లీశ్వరి వెయిట్‌ లిఫ్టింగ్‌లో సిక్కోలుకు ఓ మైలురాయి చూపించారు. మళ్లీ ఆ గమ్యాన్ని అందుకోగల వారి కోసం ఎదురు చూస్తుంటే.. అందరికీ కనిపించిన ఆశా కిరణం పూజారి శైలజ. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ  ప్రతిభావంతురాలి ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఫామ్‌ కోల్పోవడం, డోపింగ్‌ ఆరోపణలు ఎదుర్కోవడం, నిషేధం పూర్తయ్యాక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆమె సాధించిన విజయాలు మరుగున పడిపోయాయి. ఎట్టకేలకు ఆమెకు వైఎస్‌ జగన్‌ సర్కారు న్యాయం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగుర వేసిన శైలజకు శాప్‌లో కోచ్‌గా ఉద్యోగం ఇచ్చింది.   

శ్రీకాకుళం న్యూకాలనీ: పదేళ్ల కిందటి వరకు పూజారి శైలజ అంటే ఓ పాపులర్‌ వెయిట్‌ లిఫ్టర్‌. ఒలింపిక్స్‌లో కాంస్య పత కం సాధించిన కరణం మల్లేశ్వరికి సరితూగే క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. కామన్‌ వెల్త్, ఏషియన్‌ గేమ్స్, జూనియర్‌ ఏషియన్‌ గేమ్స్‌ వంటి పోటీల్లో బంగారు పతకాలతో మోత మోగించారు. ఆ తర్వా త ఎందుకో ఆటలో ఆమె వెనుకబడిపోయారు. దీనికి తోడు అనూహ్యంగా డోపింగ్‌ ఆరోపణలతో జీవితం తల్లకిందులైపోయింది. శైలజపై ఉన్న బ్యాన్‌ (నిõÙధం) ఎత్తేసినా ఆమె పరిస్థితి మాత్రం మారలేదు.

అంతకుముందు ఉన్న గుర్తింపు మొత్తం తుడి చిపెట్టుకుపోయింది. గత ప్రభుత్వ పెద్దల ముందు కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు న్యాయం చేశారు. శాప్‌లో గ్రేడ్‌–3 కోచ్‌గా నియమించారు. దీంతో తన నిరీక్షణ ఫలించిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

నెత్తిపై డోపింగ్‌ బరువు..  
2006 కామన్‌ వెల్త్‌ అనంతరం క్రీడాకారులకు జరిపిన డోపింగ్‌ పరీక్షల్లో పూజారి శైలజ పాజిటివ్‌ అని తేలడంలో ఆమె ఆట తలకిందులైంది. అయితే తా ను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఫెడరేషన్‌ ముందు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. జీవితకాలంలో నిషేధం విధించారు. వాస్తవానికి గేమ్‌లో జీవితకాల నిషేధమంటే ఏడేళ్లే. ఆ తర్వాత ఆట ప్రారంభిద్దామని శైలజ భావించినా కుటుంబ నేపథ్యం, చిన్నపిల్లల పోషణ, ఆర్థిక కష్టాల వల్ల ఈ బరువును ఎత్తలేకపోయారు.

చిన్నప్పుడే తండ్రి మృతి చెందడం, వివాహం తర్వాత తల్లి చనిపోవడం, అనంతరం కోవిడ్‌తో భర్త దూరం కావడంతో ఒంట రిగా పిల్లలతో కాలం గడుపుతున్న శైలజకు ఇన్నాళ్లకు సరైన న్యాయం జరిగింది. గత ప్రభుత్వాల పె ద్దలు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసినా ప్ర యోజనం లేకపోయిందని శైలజ ఇప్పటికే పలు మార్లు వాపోయారు. ఆమె నిరీక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెరదించారు. శాప్‌ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. విశాఖపట్నంలోని డీఎస్‌ఏలో గ్రేడ్‌–3 కోచ్‌ పోస్టులో నియమించారు.  

వంజంగి నుంచి కామన్‌వెల్త్‌కు.. 
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వంజంగి గ్రామానికి చెందిన పూజారి సీతారాం, అమ్మాజమ్మ దంపతులకు జని్మంచింది పూజారి శైలజ. 1996లో వెయిట్‌లిఫ్టింగ్‌ గేమ్‌ మొదలుపెట్టిన శైలజ జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి ఇండోర్‌ స్టేడియంలో ఓనమాలు నేర్చుకున్నారు. అలాగే ఊసవానిపేట వ్యా యామ శాలలో శిక్షణ పొందారు. ఏలూరు సాయ్‌ అకాడమీలో శిక్షణ పొందారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. పోటీల్లో దిగితే బంగారు పతకాన్ని ముద్దాడే శైలజ ప్రతిభను గుర్తించిన నాటి వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీ, అసోసియేషన్‌ ప్రతినిధులు మరింత ఉన్నతంగా శిక్షణను అందించడం మొదలుపెట్టారు.

- 1996–97లలో మధురైలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. 
- 1998లో హైదరాబాద్‌లో జరిగిన ఇండిపెండెంట్‌ గోల్డ్‌ కప్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించారు.  


- అదే ఏడాది కోల్‌కతాలో జరిగిన జూనియర్‌ నేషనల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. 
- అదే ఏడాది బెంగళూరులో జరిగిన సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. 
- 1999లో కర్ణాటక ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదరన్‌ స్టేట్‌ గేమ్స్‌లో పసిడి పతకాన్ని సాధించారు.  
- 2000లో మైసూరులో జరిగిన దక్షిణ భారత క్రీడా పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించారు.  
- 2002లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడల్లో మూడు బంగారు పతకాలను సాధించారు.  
- 2005లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. 
- 2006 వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 బంగారు, ఒక రజత పతకం, జాతీయస్థాయిలో 26 బంగారు పతకాలు గెలిచారు. తర్వాత అనేక రాజకీయాల నడుమ ఒలింపిక్స్‌లో పాల్గొనే బర్త్‌ ను కోల్పోయారు. అయితే ఒలింపిక్స్‌ రికార్డుల ను జాతీయస్థాయిలోనే బద్దలుగొట్టి ‘ఇండియన్‌ స్ట్రాంగెస్ట్‌ ఉమెన్‌‘గా శైలజ పేరు సంపాదించారు.  

జగనన్నను కలిశాక.. 
ఈ ఏడాది ఫిబ్రవరి 7న సీఎం జగనన్నను కలిశాను. నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగంలో నియమించి, కోచ్‌గా అవకాశం కల్పించారు. విశాఖపట్నం డీఎస్‌ఏలో గ్రేడ్‌–3 కోచ్‌ పోస్టును కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. జగనన్నకు రుణపడి ఉంటాను. దశాబ్దంన్నర పాటు నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  
– పూజారి శైలజ, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, శ్రీకాకుళం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top