గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి: సీఎం జగన్‌

Cm Ys Jagan Important Meeting with Party Leaders - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతోనూ చేస్తున్నామని సీఎం అన్నారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. జులై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఈలోగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు కల్పించాలని’’ సీఎం అన్నారు.

‘‘కలిసికట్టుగా పనిచేయాలి, ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టాలి. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి. మే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నాం.. అందరూ సన్నద్ధం కావాలి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top