సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్‌ విరాళం

CM YS Jagan Donates To The Armed Forces Flag Day Fund - Sakshi

సాక్షి, అమరావతి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్‌ వెల్‌ఫేర్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి సీఎం జగన్‌కి జ్ఞాపిక అందజేశారు.
(చదవండి: ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌)

ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ఓటీఎస్‌ వరం... స్పాట్‌లో రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top