ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting On Agriculture Department - Sakshi

వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష

సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.

చదవండి: పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటీఎస్‌

‘‘ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి. వరి పండిస్తే.. వచ్చే ఆదాయం మిల్లెట్స్‌ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీని కోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి. మిల్లెట్స్‌ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి. మిల్లెట్స్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీంతో పాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి.
రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి.
రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురండి. 
ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్‌ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్‌ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి. 
సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి.

ఖరీఫ్‌లో 1.12 కోట్ల  ఎకరాల ఇ–క్రాప్‌ 
45,35,102 మంది రైతులు ఇ– క్రాప్‌ చేయించుకున్నారు.
రబీలో ఇ– క్రాప్‌ ప్రారంభించామని తెలిపిన అధికారులు
ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌సర్టిఫికేషన్‌కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలన్న సీఎం.

రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు: సీఎం
రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు :సీఎం
దీనికోసం చట్టంలో మార్పులు, అవసరమైతే ఆర్డినెన్స్‌
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయి
వీటిని నీరేగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయి
ఈ వ్యవహారాల్లో ఉద్యోగులు ప్రమేయం ఉంటే.. వారిని తొలగించడమే కాదు.. చట్టంముందు నిలబెడతాం
అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయి

రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదు
డిమాండ్‌ మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి
కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో ఉంచాల్సిన పరికరాలపై హేతుబద్ధత ఉండాలి
రైతులకు అందించాల్సిన పరికరాలు కూడా రైతుల సంఖ్య, సాగు చేస్తున్న భూమి , వేస్తున్న పంటల ఆధారంగా హేతుబద్ధతతో వాటిని అందుబాటులోకి తీసుకురావాలి దీనిపై మ్యాపింగ్‌ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

పశువులకు ఆర్గానిక్‌ ఫీడ్‌ కూడా అందుబాటులో ఉండాలి
ఆర్గానిక్‌ మిల్క్‌పైన మార్కెటింగ్‌పైన దృషిపెట్టండి
​​​​​​​►దీనివల్ల రైతులకు మంచి ఆదాయాలు లభిస్తాయి
అలాగే ఆర్గానిక్‌ఉత్పత్తుల ప్రాససింగ్‌పైన కూడా దృష్టిపెట్టండి
జిల్లాకు ఒక ప్రాససింగ్‌ యూనిట్‌కూడా పెట్టేలా చర్యలు తీసుకోవాలి

జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష
డిసెంబరులో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం
పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మహిళలకు లబ్ధి
సగటున రోజువారీ పాలసేకరణ నవంబర్, 2020లో 2,812 లీటర్లు, నవంబర్‌ , 2021లో 71,911 లీటర్లు
ఇప్పటివరకూ 1కోటి 32లక్షల లీటర్ల పాలు కొనుగోలు

చదవండి: 
జగన్‌ ప్రభుత్వంలోనే ఎయిడెడ్‌కు జీవం
సీఎం జగన్‌ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top