
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
సాక్షి, కర్నూలు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గురువారం ఉదయం కోడుమూరురోడ్డులోని కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
గురువారం ఉదయం తొలుత గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారాయన. అక్కడి నుంచి కోడుమూరురోడ్డులోని వివాహ వేదికకు వెళ్లారు. అక్కడ వివాహ వేడుకకు హాజరై.. నూతన వధువరులను ఆశీర్వదించారు.