వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల సాయం

CM YS Jagan announces Rs 10 lakh assistance to Varalakshmi family - Sakshi

ప్రకటించిన సీఎం జగన్‌ 

 సాక్షి, అమరావతి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల నుంచి వివరాలను తెలుసుకున్న సీఎం బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు.

ప్రతి టీనేజ్‌ బాలిక మొదలు మహిళలందరూ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా ఎడ్యుకేట్‌ చేయాలని సూచించారు. పాఠశాల, కాలేజీ విద్యార్థినులు వందశాతం ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను అదుపుచేయడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని మహిళలు సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top