బాలిక లివర్‌ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం | Sakshi
Sakshi News home page

బాలిక లివర్‌ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం

Published Mon, Sep 19 2022 6:30 AM

CM relief fund for girl liver transplant Andhra Pradesh - Sakshi

కడప కార్పొరేషన్‌: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు, హరూన్‌ గ్రూప్‌ సంస్థల ఎండీ ఎస్‌బి అహ్మద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్‌ షబానా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు.

కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్‌ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రిని సంప్రదించగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు.

డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్‌ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం తన లివర్‌ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. 

Advertisement
Advertisement