
సాక్షి, అమరావతి: ఏపీలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సీఎం జగన్ రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఎంఎస్‌ఎమ్‌ఈ, స్పిన్నింగ్ మిల్లులు, టెక్స్‌టైల్‌కు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కరోనా కష్టకాలంలో ఎంఎస్‌ఎమ్‌ఈలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో ఏపీలో పారిశ్రామికాభివృద్ది మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం తొలి విడత నిధులు విడుదల చేసింది. రెండో విడత నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేయనున్నారు.
చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి: సీఎం జగన్