ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

CM Jagan ramzan‌ Greetings to the Muslim Brothers - Sakshi

రంజాన్‌ నెల ప్రారంభం సందర్భంగా..

సాక్షి, అమరావతి: రంజాన్‌ నెల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని.. నెలరోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాసవ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొంటారని పేర్కొన్నారు.

వారికి అల్లాహ్‌ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాసదీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప దీక్ష అని ఆయన తెలిపారు.  ఈ మేరకు ఆయన ట్వీట్‌ కూడా చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top