అక్కచెల్లెమ్మలే నా స్టార్‌ క్యాంపెయినర్లు  | Sakshi
Sakshi News home page

అక్కచెల్లెమ్మలే నా స్టార్‌ క్యాంపెయినర్లు 

Published Wed, Jan 24 2024 5:11 AM

CM Jagan Public Meeting in Uravakonda - Sakshi

సాక్షి, అనంతపురం (ఉరవకొండ) :  ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్‌ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను.

మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్‌ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు.

మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్‌ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు.

వారికి మంచి చేసిన చరిత్రే లేదు 
‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్‌ రెసిడెంట్‌గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్‌ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్‌ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లే.

వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉన్నారు.

అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇ­తర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లుగా కనిపిస్తా­రు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«­దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు. 

బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు రూ.33 కోట్లు 
జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement