ఆరు దశాబ్దాల కల నెరవేరే వేళ.. రేపు పల్నాడు మాచర్లకు సీఎం జగన్‌

Cm Jagan Palnadu District Macherla Tour Schedule - Sakshi

సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఇందుకోసం బుధవారం మాచర్లలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరికపుడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.

సీఎం జగన్‌ మాచర్ల షెడ్యూల్‌​ ప్రకారం.. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.

పులుల అభయారణ్యం (టైగర్‌ ఫారెస్ట్‌)లో వరికపుడి­శెల ఎత్తిపోతల, పైపులైన్‌ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తి­పోతల తొలి దశ పనులను లైన్‌ క్లియర్‌ అయ్యింది. దాదాపు రూ.340.26 కోట్లతో జరగబోయే పనులకు బుధవారం సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ­ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్‌ ఇరిగేషన్‌(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడు­గులు వేస్తోంది జగనన్న ప్రభుత్వం.

చదవండి: పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top