ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Updates:
02:39PM
- ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
- తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్
Time: 11:23 AM
అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వినతించారు. ఏపీ విభజన అంశాలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Time: 10:43 AM
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిల సహా తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
Time: 10:16 AM
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
సాక్షి, అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
మరిన్ని వార్తలు :