జర్నలిస్ట్‌ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌ | CM Jagan Launches Journalist Rehana Book Pen Drive at Tadepalli | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

Nov 11 2022 4:54 PM | Updated on Nov 11 2022 5:29 PM

CM Jagan Launches Journalist Rehana Book Pen Drive at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: జర్నలిస్ట్‌ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌డ్రైవ్‌ పుస్తకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆమె వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్‌ డ్రైవ్‌ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా రెహాన ప్రయత్నాన్ని సీఎం జగన్‌ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు. 

చదవండి: (సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు)

Advertisement
 
Advertisement
Advertisement