మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తాం: సీఎం జగన్‌

CM Jagan Inaugurates Sunny Opotech Industry in Vikruthamala Village - Sakshi

తిరుపతి: సన్నీ ఆప్కోటిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మొబైల్‌ ఫోన్‌ కెమెరా లెన్స్‌ను సన్నీ ఆప్కోటెక్‌ తయారు చేస్తోంది. వివిధ రకాల మొబైల్‌ కంపెనీలకు కెమెరాలను ఆ సంస్థ సరఫరా చేయనుంది. రూ.254 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయగా, 3వేల మందికి ఉద్యోగ అవకాశం కలగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు.

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ఈ క్లస్టర్‌లో మూడు ప్రాజెక్టులను ప్రారంభించాం
మరో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం
టీసీఎల్‌ యూనిట్‌ను ప్రారంభించాం
టీవీ ప్యానెళ్లు, మొబైల్‌ డిస్‌ప్లే ప్యానెళ్లు ఇక్కడ తయారుచేస్తారు
3200 మందికి ఉపాధినిస్తున్నారు
ట్రయల్‌రన్స్‌కూడా జరుగుతున్నాయి
ఫాక్స్‌లింక్స్‌ అనే సంస్థ యూఎస్‌బీ కేబుళ్లు, సర్క్యూట్‌ బోర్డులను తయారు చేస్తోంది
ఫ్యాక్టరీని పూర్తిచేసింది. మరో 2వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది
సన్నో ఒప్పోటెక్‌ సెల్‌ఫోన్లు కెమెరా లెన్స్‌లు తయారు చేస్తోంది
ఈ ఫ్యాక్టరీ కూడా పూర్తయ్యింది
1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది
నెలరోజులు తిరక్కముందే 6,400 మంది మన కళ్లముందే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది
శంకుస్థాపన మూడు ప్రాజెక్టులకు వేశాం
ఇదే ఈఎంసీలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశాం
నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఏడాది కాలంలో పూర్తవుతుంది. 850 మందికి ఉద్యోగాలు వస్తాయి
ఫాక్స్‌లింక్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతుంది
ఏడాదిలో ప్రొడక్షన్‌ కూడా స్టార్ట్‌ చేస్తుంది
ఈ ఈఎంసీకి రాకముందు అపాచీ సంస్థకు సంబంధించిన సంస్థకు రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు
15 నెలల్లో పూర్తవుతుంది. 10వేల మందికి ఉద్యోగా అవకాశాలు వస్తాయి
ఇవాళ అన్నీ కలిపితే మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం
మరో 3 ప్రాజెక్టులనుకూడా ప్రారంభించాం
వీటి అన్నింటి ద్వారా దాదాపుగా రూ.4వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి, దాదాపుగా రూ.20వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి
ఇక్కడ యూనిట్లు పెట్టిన వారందరికీ ఒక్కటి చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది
ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ఉన్నాం
కచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి.. మా రాష్ట్రంలో మీ ప్రయాణం అద్భుతంగా ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నాం. అందరికీ అభినందనలు అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top