రాహుల్‌ బజాజ్‌ మృతి... సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

CM Jagan Expressed Grief Over The Demise Of Rahul Bajaj - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్  రాహుల్ బజాజ్ (83) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత పారిశ్రామిక రంగంలో రాహుల్‌ బజాజ్‌ అనేక సేవలనందించారని సీఎం గుర్తు చేశారు. 

కాగా గత కొద్ది రోజులుగా రాహుల్‌ బజాజ్‌ న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో  ఫిబ్రవరి 12  శనివారం రోజున మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనను విడుదల చేసింది. 40 ఏళ్ల పాటు బజాజ్‌ గ్రూప్‌ చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్‌ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు.

రాహుల్ బజాజ్ మృతి పట్ల గవర్నర్ సంతాపం 
సాక్షి, విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మృతిపైట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు రాహుల్ బజాజ్ దేశంలో ఆటోమొబైల్ రంగం ఉన్నతికి దోహద పడ్డారని వివరించారు. బజాజ్ స్కూటర్‌ను ఆవిష్కరించి దేశంలోని ప్రతి ఇంటికి దానిని చేరువ చేశారన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
(చదవండి: చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా: ఎమ్మెల్యే జోగి రమేష్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top