సీఎం జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా

Cm Jagan Anantapur District Tour Has Been Postponed - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 26కి వాయిదా వేసినట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు. 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఐదోసారి జిల్లాకు సీఎం జగన్‌
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఐదోసారి వస్తున్నారు. తొలిసారిగా అనంతపురం జిల్లా కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత ధర్మవరంలో నేతన్న హస్తం, వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రైతుదినోత్సవం పేరుతో రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడే ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్‌ ప్రారంభించారు.

అనంతరం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు శింగనమల నియోజకవర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడి నుంచే కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వసతి దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారు.

కాగా, రేపు(సోమవారం) ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్‌ విందులో సీఎం హాజరవనున్నారు.
చదవండి: రామోజీరావు అంటే ఆయన కుమారుడు సుమన్‌కి నచ్చదు.. ఎందుకంటే?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top