సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలోని రుషికొండపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ భవనాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కొండచరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునిక భవనాలను నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారని వైఎస్సార్‌సీపీ తెలిపింది.
వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా.. ఈ నేపథ్యంలో వైఎస్సార్.. రుషికొండపై భవనాలను కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించి కట్టారు. ప్రభుత్వ భవనాలను ఎంతో అత్యాధునికంగా భవనాల్ని నిర్మించారని కితాబిచ్చారని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబుకు కౌంటరిచ్చింది. అమరావతిలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి నాసిరకం ప్రభుత్వ భవనాల్ని అప్పట్లో చంద్రబాబు నిర్మించారని గుర్తు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వ భవనాల్ని ఎలా నిర్మించాలో తెలుసుకో చంద్రబాబు అంటూ చురకలంటించింది.
వైయస్ జగన్ గారి హయాంలో నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై సీఎం @ncbn ప్రశంసలు
కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించి.. ఆ తర్వాత అత్యాధునికంగా భవనాల్ని నిర్మించారని కితాబు
అమరావతిలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి నాసిరకం ప్రభుత్వ భవనాల్ని అప్పట్లో… pic.twitter.com/Wc2ukxwdKG— YSR Congress Party (@YSRCParty) November 2, 2024
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖలో పర్యటించారు. ఈ సందర్బంగా రుషికొండపై వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలను పరిశీలించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
That is Jagan !! pic.twitter.com/f4LJzBHOGB
— Sridhar Reddy Avuthu (@SridharAvuthu) November 2, 2024
Comments
Please login to add a commentAdd a comment