శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీజేఐ

CJI Justice Chandrachud Visits Kalyana Venkateswara swamy temple - Sakshi

సాక్షి, తిరుమల: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్.. జస్టిస్ చంద్ర చూడ్‌కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర  చూడ్ దంపతులు స్వామివారిని  దర్శించుకున్నారు.

అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం సీజేఐకి చైర్మన్, ఈవో స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్ర చూడ్ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోవు, దూడకు పూజలు చేసి గ్రాసం తినిపించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్, ఆర్డీవో కనక నరసారెడ్డి, డిప్యూటీ ఈవో వరలక్ష్మి , విజివో మనోహర్, అదనపు ఎస్పీ కులశేఖర్, డిఎస్పీ నరసప్ప, ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారధి, బాలాజి రంగాచార్యులు ఆలయ సూపరింటెండెంట్ ముని చంగలరాయులు పాల్గొన్నారు.

చదవండి: (రిలయన్స్‌ను పరుగులు పెట్టించిన అంబానీ.. 20 ఏళ్లలోనే..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top