క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | Christmas 2024: YS Jagan Christmas Wishes to Christians | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Dec 24 2024 3:40 PM | Updated on Dec 25 2024 7:36 AM

Christmas 2024: YS Jagan Christmas Wishes to Christians

వైఎస్సార్‌, సాక్షి: క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకుని క్రెస్తవులందరికీ వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారాయన.

‘‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు..

.. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి’’ అని తన క్రిస్మస్‌(Christmas) సందేశంలో వైఎస్‌ జగన్‌(YS Jagan) పేర్కొన్నారు.

ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ ఇడుపులపాయలో నిర్వహించిన క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement