మళ్ళీ మంగళవారం.. మరో 7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌ | Chandrababu Naidu government has incurred an additional debt of 7,000 crores | Sakshi
Sakshi News home page

మళ్ళీ మంగళవారం.. మరో 7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌

Jun 10 2025 9:13 PM | Updated on Jun 10 2025 9:28 PM

Chandrababu Naidu government has incurred an additional debt of 7,000 crores

సాక్షి,విజయవాడ: మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చింది.దీంతో అప్పుల ప్రభుత్వంగా సరికొత్త చెత్త రికార్డ్‌లను నమోదు చేసింది. తాజాగా, చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 7 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ అప్పు  చేసిన ప్రభుత్వంగా నిలిచింది. వారం రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. మంగళవారం (ఈరోజు) అప్పు రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది.

రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పును సమీకరించింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే  చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షా 58 వేల కోట్ల అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం.. అప్పుల సృష్టిలో రికార్డ్‌లు సృష్టించడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement