మార్కెట్‌ కమిటీలకు లక్ష్మీకళ

Cess Collection In YSR district Target 11 Crores - Sakshi

వైఎస్సార్‌ జిల్లాలో వేగంగా సెస్సు వసూలు

ఈ ఏడాది లక్ష్యం రూ. 11.72 కోట్లు

ఇప్పటి వరకు రూ. 601.52 లక్షల వసూళ్లు

కడప అగ్రికల్చర్‌: జిల్లావ్యాప్తంగా మార్కెట్‌ కమిటీలు సెస్సు వసూళ్లతో కళకళ లాడుతున్నాయి. ఈ ఏడాది రూ. 11.72 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా అక్టోబర్‌ చివరి నాటికి రూ. 601.52 లక్షలు వసులయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్‌ చివరి నాటికి రూ. 496.95 లక్షలు వసూలయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ. 104.57 లక్షలు అధికంగా సెస్సు వసూలు కావడం గమనార్హం.

జిల్లాలో పది మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. జమ్మలమడుగు, కమలాపురం మార్కెట్‌ కమిటిలీలు తప్ప మిగిలినవి గతేడాది కంటే ఈ సంవత్సరం అక్టోబర్‌ చివరినాటికి లక్ష్యానికంటే అధికంగా సెస్స్‌ వసూలు చేశాయి. కడప మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 200 లక్షలకుగాను గతేడాది అక్టోబర్‌ చివరి నాటికి రూ.91.99 లక్షలు వసులు చేయగా ఈ సంవత్సరం రూ.98.45 లక్షలు వసూలు చేసింది పొద్దుటూరు మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 205 లక్షలుకాగా గతేడాది అక్టోబర్‌ చివరి నాటికి రూ.73.83 లక్షలు, ఈ ఏడాది రూ. 79.92 లక్షలు వసులయ్యాయి.

బద్వేల్‌ మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 145 లక్షలు కాగా గతేడాది అక్టోబర్‌ చివరినాటికి రూ. 78.49లక్షలు, ఈ ఏడాది రూ. 113.09 లక్షలు, పులివెందుల మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 92 లక్షలు కాగా గతేడాది అక్టోబర్‌ చివరినాటికి రూ.39.42 లక్షలు, ఈ ఏడాది రూ. 47.80 లక్షలు, మైదుకూరు మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 165 లక్షలు కాగా గతేడాది అక్టోబర్‌ చివరినాటికి రూ. 85.98 లక్షలు, ఈ ఏడాది రూ.119.67 లక్షలు, సిద్దవటం మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 30 లక్షలు కాగా గతేడాది అక్టోబర్‌ చివరినాటికి రూ. 10.09 లక్షలు, ఈ ఏడాది రూ.10.66 లక్షలు, ఎర్రగుంట్ల మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 70 లక్షలుకాగా ఈ ఏడాది అక్టోబర్‌ చివరి నాటికి రూ. 27.30 లక్షలు, ఈ ఏడాది రూ. 31.91 లక్షలు, నూతనంగా ఏర్పాటు చేసిన సింహాద్రిపురం మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 30 లక్షలు కాగా ఇప్పటి వరకు రూ. 17.18 లక్షలు వసూలు చేసింది.  

జిల్లాలో మార్కెట్‌ కమిటీ వివరాలు.... 
జిల్లాలో కడప, పొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల,మైదుకూరు, కమలాపురం, ఎల్‌ఆర్‌పల్లె, సిద్దవటం, ఎర్రగుంట్లలో మార్కెటింగ్‌ కమిటిలు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్‌ కమిటీలో పసుపు, వేరుశనగకు సంబంధించిన క్రయవిక్రయాలు జరగ్గా మిగతా మార్కెట్‌ కమిటీల్లో పండ్లు, ఇతర ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతాయి.  

జిల్లాలో పది మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్‌ పోస్టులు ఉన్నాయి. ఇందులో కడప మార్కెట్‌ కమిటీలో పసుపు, వేరుశనగ వంటివి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. జిల్లాలో కడప మార్కెట్‌ కమిటీ నుంచే ఎక్కువగా చెస్‌ వసూలు అవుతుంది. మిగతా 9 మార్కెట్‌ కమిటీల్లో పలు రకాల ఉత్పత్తుల విక్రయాలు జరుగుతుంటాయి. పులివెందుల మార్కెట్‌ కమిటీ నుంచి బత్తాయి, అరటి, నిమ్మ వంటివి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్సు చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరి కొంతమంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్‌ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు.  గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ ఉత్పత్తుల ధరతో ఒక శాతం సెస్సుగా వసూలు చేసేవారు. ఈ ఏడాది ధాన్యంపై సెస్సును 2 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు  
జిల్లాలో 2022–23 ఏడాదికి 10 మార్కెట్‌ కమిటీల పరిధిలో 21 చెక్‌ పోస్టులు ఉన్నాయి. అయా చెక్‌ పోస్టుల ద్వారా వార్షికాదాయం ఏడాదికి రూ. 11.72 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెస్సు వసూలు అశాజనకంగా ఉంది. ఇచ్చిన టార్గెట్‌లో ఇప్పటి వరకు రూ. 601.52 లక్షలు వసూలు చేసి 51.38 శాతం సాధించాం. మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని అధిగమిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  
–హిమశైల, మార్కెటింగ్‌శాఖ ఏడీ, వైస్సార్‌జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top