పిచ్చెక్కిన పిల్లి.. అర్ధరాత్రి వీరంగం | Cat Attacked The Village In Vizianagaram District | Sakshi
Sakshi News home page

పిచ్చెక్కిన పిల్లి.. అర్ధరాత్రి వీరంగం

Jul 5 2021 9:41 AM | Updated on Jul 5 2021 1:33 PM

Cat Attacked The Village In Vizianagaram District - Sakshi

విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయపీట గ్రామంలో ఓ పిచ్చెక్కిన పిల్లి శనివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. గ్రామస్తులపై దాడి చేసి దొరికినవారినల్లా కరిచింది.

కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయపీట గ్రామంలో ఓ పిచ్చెక్కిన పిల్లి శనివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. గ్రామస్తులపై దాడి చేసి దొరికినవారినల్లా కరిచింది. పిల్లి కరవడంతో ఆర్‌.తవిటమ్మ, జి.లక్ష్మి, ఎం.శ్రీధర్, డి.రాములనాయుడు, ఎం.గౌరునాయుడు, ఎస్‌.లక్ష్మి, వలంటీర్‌ బి.దామోదర్‌నాయుడులు గాయపడ్డారు. వీరిని రాత్రికి రాత్రే గ్రామస్తులు 108లో చినమేరింగి సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఎం.శ్రీధర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement