
సాక్షి,అల్లూరి జిల్లా: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. పాడేరులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే సమయంలో భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది.
ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షాతగాత్రలను పాడేరు ఆసుపత్రి కి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి అత్యంత విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆరాతీస్తున్నారు.