టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు

Capital Amaravati Land Case: Ap Cid Notices To Tdp Leader Narayana - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.

నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.

కాగా, రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్‌ భూములను  సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని  మళ్లిం­చేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్‌ కంపెనీని వాడు­కున్నట్లు తేలింది.
చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top