'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించాం'

Buggana Rajendranath Met With Nirmala Sitharaman In Delhi For AP Benfits - Sakshi

ఢిల్లీ : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడారు.' పోలవరంకు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, వివిధ పథకాలకు సంబంధించిన నిధులపై చర్చించాము. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ , పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరాము. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ మరోసారి ప్రస్తావించాం. రాష్ట్రానికి రూ. మూడు వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం.

కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన కూడా ఈ అంశాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం బకాయిలను కేంద్రం త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది. మేం ప్రతిపాధించిన అన్ని అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. బకాయిల చెల్లింపు లు అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంటుంది.' అంటూ తెలిపారు. కాగా బుగ్గన వెంట ఎంపీలు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్ , సలహాదారు అజయ్ కల్లం తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top