
సాక్షి, ఢిల్లీ: హిందూ ఉద్ధారకుడిగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఆయన హయాంలో అనేక దేవాలయాలను కూల్చేశారని, పుష్కరాల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని జీవీఎల్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది, అమరావతిలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. గతంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందేని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశామని తెలిపారు. చర్చి పై రాళ్ళు వేశారనే ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. (చదవండి: చంద్రబాబు సాయం కోర్టులకు అక్కర్లేదు)