ప్రయాణికుడి చెంపపై కొట్టిన మహిళా కండక్టర్‌ | Krishna Bus Woman Conductor Behaved Inappropriately With Passenger And Slapped Him In RTC Bus | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి చెంపపై కొట్టిన మహిళా కండక్టర్‌

Jun 27 2025 6:36 AM | Updated on Jun 27 2025 9:23 AM

Behaving inappropriately Krishna Bus Woman Conductor

తోట్లవల్లూరు: ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పట్ల మహిళా కండక్టర్‌ అనుచితంగా ప్రవర్తించటమే కాకుండా చొక్కా పట్టుకుని చెంప చెళ్లుమనిపించిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది.  సేకరించిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళుతున్న ఆర్‌టీసీ బస్సును గురువారం ఉదయం ఓ వ్యక్తి ఎక్కాడు. టికెట్‌ తీసుకునే క్రమంలో టికెట్‌కు సరిపడా చిల్లర లేకుండా బస్సు ఎందుకు ఎక్కావంటూ మహిళా కండక్టర్‌ ప్రయాణికుడి పట్ల దురుçసుగా ప్రవర్తించారు. 

ఈ విషయమై ఇరువురి మధ్య వాదన జరగటంతో కనకదుర్గమ్మ కాలనీ వద్ద కండక్టర్‌ బస్సును నిలిపివేశారు. ప్రయాణికుడిని బస్సు నుంచి దించి, ‘నన్ను బూతులు తిడతావా’ అంటూ అతని చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ ఘటనను చూసిన పలువురు స్థానికులు నివ్వెరపోయారు. టికెట్‌ తీసుకునే విషయంలో ప్రయాణికుడి పొరపాటు ఉన్నప్పటికీ, అతని చొక్కా పట్టుకుని కొట్టేంత వరకు వెళ్లిన మహిళా కండక్టర్‌ ప్రవర్తన పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement