విశాఖ గర్జన రోజే పవన్‌ మీటింగ్‌ అవసరమా?: మంత్రి అవంతి సీరియస్‌

Avanti Srinivas Serious On Janasena Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ గర్జన కోసం జేఏసీ సిద్దమైంది. ఇందులో భాగంగానే బుధవారం మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. మూడు రాజధానులకు మద్దతుగా పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ.. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలి అని కోరారు. 

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విశాఖ గర్జన అంటే పవన్‌ కల్యాణ్‌ నిద్ర లేచారు. విశాఖ గర్జన రోజే విశాఖలో పవన్‌ మీటింగ్‌ అవసరమా?. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దు?. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ 6వేల గ్రామాలు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలుద్దాము అని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top