'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి? | Ustaad Bhagat Singh Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh: పవన్ కొత్త సినిమా.. ట్విటర్ టాక్ ఏంటి?

Mar 19 2026 7:16 AM | Updated on Mar 19 2026 11:27 AM

Ustaad Bhagat Singh Movie Twitter Review

పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. తొలి నుంచి ఇది తమిళ మూవీ 'తెరి'కి రీమేక్ అని ప్రచారం సాగింది. గత కొన్నాళ్ల నుంచి ఈ విషయాన్ని డైరెక్టర్ ఖండిస్తూ వచ్చాడు. అయినా సరే దీనిపై పెద్దగా బజ్ లేదు. దానికి తోడు 'ధురంధర్ 2'కి పోటీగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఆంధ్రలో ఎర్లీ మార్నింగ్, ఓవర్సీస్ షోలు పడ్డాయి. మూవీ చూసిన ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో ఏముంటున్నారు? ట్విటర్ టాక్ ఏంటి?

(ఇదీ చదవండి: ‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

'ఉస్తాద్ భగత్ సింగ్' పూర్తిగా ఔట్ డేటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. రైటింగ్ పరంగా కొత్తగా ఏం ఆశించలేం కానీ ఉన్నంతవరకైనా బాగా తీయాలిగా. అది కూడా సరిగా తీయలేదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. కామెడీ, కమర్షియల్ రైటింగ్ విషయంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. అలానే పవన్ ఎనర్జీ కూడా మిస్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)

Advertisement
 
Advertisement
Advertisement