పవన్ VS రణ్‌వీర్.. ఇది మూడోసారి | Pawan Kalyan vs Ranveer Singh Box Office Clash Details | Sakshi
Sakshi News home page

Pawan Kalyan vs Ranveer: రెండుసార్లు ఆ హీరోకే ప్లస్.. మరి ఇప్పుడు?

Mar 19 2026 10:05 AM | Updated on Mar 19 2026 12:59 PM

Pawan Kalyan vs Ranveer Singh Box Office Clash Details

భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రణ్‍వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు పోటీగా రిలీజైన చిత్రం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీటి టాక్ ఏంటి? చూసిన వాళ్లు ఏమంటున్నారు? అనే విషయాల్ని పక్కనబెడితే పవన్ vs రణ్‌వీర్ పోటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలోనూ ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు.

(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)

రణ్‌వీర్ సింగ్.. హిందీ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇక్కడ కూడా ఇతడి మూవీస్ రిలీజయ్యాయి. గతంలో అంటే 2011లో పవన్ కల్యాణ్ 'పంజా' వచ్చినప్పుడే రణ్‌వీర్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' మూవీ కూడా వచ్చింది. వీటిలో పంజా ఫ్లాప్ కాగా రణ్‌వీర్ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. 2023లోనూ మళ్లీ వీళ్లిద్దరూ ఒకేరోజున చిత్రాల్ని రిలీజ్ చేశారు. పవన్ 'బ్రో' సినిమాతో రాగా రణ్‌వీర్ 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'తో వచ్చాడు. ఇక్కడ సేమ్ సీన్ రిపీటైంది పవన్ మూవీ ఫ్లాప్ కాగా రణ్‌వీర్ హిట్ కొట్టాడు.

ఇ‍పుడు ముచ్చటగా మూడోసారి రణ్‌వీర్ వర్సెస్ పవన్ పోటీలో నిలిచారు. ఈసారి రణ్‌వీర్ 'ధురంధర్ 2' ఆధిపత్యమే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ప్రీమియర్‌ల నుంచే నెగిటాక్ వస్తోంది. కంటెంట్ మరీ ఔట్ డేటెడ్‌గా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 'ధురంధర్ 2' హవా తెలుగులోనూ గట్టిగానే ఉండొచ్చు.

(ఇదీ చదవండి: ‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement