‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’కు దరఖాస్తు చేసుకోండి 

Apply For Jagananna Smart Town - Sakshi

వీఎంసీ కమిషనర్‌ ప్రసన్నవెంకటేష్‌ 

పటమట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఈ మేరకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పథకం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 5 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేలా ఇంటి స్థలాలను అందించనుందని వీఎంసీ కమిషనర్‌ ప్రసన్నవెంకటేష్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్ని వసతులతో ఈ స్థలాలను అభివృద్ధి చేసి అందించనున్నట్టు వివరించారు.  రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ(ప్రభుత్వ ఉద్యోగులు కూడా) ఈ పథకానికి అర్హులని, 150 చదరపు గజాల స్థలం పొందాలంటే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు, 200 చదరపు గజాలకు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, 240 చదరపు గజాల స్థలానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు సంవత్సరాదాయం ఉండాలని పేర్కొన్నారు.  సచివాలయ సిబ్బంది ఈనెల 6,7 తేదీల్లో డిమాండ్‌ సర్వే నిర్వహిస్తారని, అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
చదవండి:
ఓపీఎం వెనుక డ్రగ్‌ మాఫియా! 
‘ఉప ఎన్నికనూ బహిష్కరిద్దామా.. సార్‌!’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top