ఏపీలో జర్నలిస్టులకు తీపికబురు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో జారీ

AP YS Jagan Govt Release GO Regards house sites for journalists - Sakshi

సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గత కేబినెట్‌ భేటీలో తీసుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు.. ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వుల్లో విషయాన్ని ప్రస్తావించింది. 60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే.. కనీసం 5 ఏళ్లు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ వర్తించనుంది.  జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది కూడా. 

ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌ సైట్‌ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top