
AP Elections Political Latest Updates Telugu..
7:47 PM, Feb 10, 2024
శ్రీకాకుళం: లోకేష్‌కు మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్
- రాష్ట్రానికి సీఎం జగన్ చేసిందేమిటో, మీ నాన్న 14 ఏళ్లు చేసిందేమిటో చర్చిద్దాం
- టీడీపీ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్టయినా జిల్లాలో కట్టారా?
- చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిందేమిటి?
- 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ప్రజలకు అంకితం చేసిన ఘనత సీఎం జగన్‌ది
- కిడ్నీ జబ్బులు నిర్మూలించడానికి రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది
- శ్రీకాకుళం జిల్లా ఇతర జిల్లాలతో పోటీ పడేటట్లు చేయడానికి మూలపేటలో పోర్టు నిర్మాణం చేపడుతున్నాం
5:24 PM, Feb 10, 2024
టీడీపీలోనే ‘ఉండి’... రాజుల రగడ!
- తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య ముదిరిన వర్గవిభేదాలు
- పరస్పరం విమర్శలకు దిగుతున్న రామరాజు, శివరామరాజు
- ఒకరికి తండ్రి, మరొకరికి కొడుకుల మద్దతు
- పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెలుగుదేశంలో తారస్థాయికి వర్గవిభేదాలు
- తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుపాకాన పడుతున్నాయి
- ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజుకు లోకేశ్, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు చంద్రబాబు కొమ్ముకాస్తుండటంతో వారిద్దరి సిగపట్లు పత్రికలకెక్కుతున్నాయి.
3:59 PM, Feb 10, 2024
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలు: మంత్రి జోగి రమేష్
- కోలవెన్నులో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ చేసిన మంత్రి
- ఆసరా పండుగలా జరుగుతుంది
- పేదవారి జీవితాల్లో వెలుగు నింపేందుకు జగన్ కృషి చేస్తున్నారు
- ఇంటికి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
- పైసా ఖర్చు లేకుండా విద్య, వైద్యం అందిస్తున్నాం
- రాబోయే 25 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారు
1:06PM, Feb 10, 2024
నర్సీపట్నం నియోజకవర్గంలో షర్మిల రచ్చబండ
షర్మిలను నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త
- కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబంను వేధించింది
- వైఎస్సార్‌పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్
- జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది
- ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు
- వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని తప్పుపట్టారు
- ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు
- నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి
- సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవాడు సుభిక్షంగా ఉన్నార
- ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి
12:20PM, Feb 10, 2024
జగనన్న కాలనీలతో సీఎం జగన్ ఊర్లు కడుతున్నారు: కురసాల కన్నబాబు
- రాష్ట్రంలో 17 వేల ఊర్లు తయారవుతున్నాయి.
- లక్షలాది మందికి నా కంటూ ఒక స్ధలం ఉందని ఆసరా లబిస్దోంది
- పేదలకిచ్చిన స్ధలాలను రిజిస్ట్రేషన్ చేసి చేతికిచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- జగనన్న ఇచ్చిన ఈ ఆస్తిని మీ తరాలకు ఇచ్చి అభివృద్ధి చేసుకోండి
- ఎన్ని యిబ్బందులు వచ్చినా.. పేదల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
12:00PM, Feb 10, 2024
టీడీపీని చంద్రబాబు హీనమైన పరిస్థితికి తీసుకువచ్చాడు: లక్ష్మీపార్వతి
- బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు చంద్రబాబు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్ ద్వారా ఆయన బీజేపీ పెద్దలను కలిశారని ప్రచారం జరుగుతుంది
- మహానుభావుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు
- తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఇప్పుడు ప్రతి వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడు
- చంద్రబాబు టీడీపీని హీనమైన పరిస్థితి తీసుకువచ్చాడు
- ఎంతో మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఆయన్ని బహిష్కరించారు
- కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించారు
- మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు
11:41AM, Feb 10, 2024
జనసేనకు 70 సీట్లు ఇవ్వాలని డిమాండ్
విశాఖ:
- కాపు గ్రూపులో జనసేన-టీడీపీ సీట్లు పంపకంపై చర్చ
- 70 సీట్లు కన్నా తక్కువ ఇస్తే కాపుల ఆగ్రహానికి టీడీపీ బలైపోతుంది
- 70 సీట్లు కన్న తక్కువ తీసుకుంటే పవన్ కళ్యాణ్‌ని కాపులు కూడా నమ్మరు
- మీ కర్మకు మీరే బాధ్యులు అవుతారంటూ పోస్టింగులు
- జనసేనకు 20 నుంచి 25 సీట్లు కేటాయింపనే వార్తల నేపథ్యంలో కాపు గ్రూపుల్లో చర్చ
10:00 AM, Feb 10, 2024
పవన్ పార్టీలో ఆశయాలు ఎక్కడా కనిపించలేదు: మంత్రి వేణు
- స్వాతంత్ర్యం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి కుప్పకూలిపోయింది
- మంచి ఆశయాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారు
- కాపు సామాజిక వర్గాన్ని ఆదుకోవాలనే ఆశయంతో చిరంజీవి పార్టీ ప్రారంభించారు.
- రాజ్యసభ దక్కించుకోవాలని ఆశతో పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు
- తండ్రి ఆశయాల కోసం సీఎం జగన్ పార్టీని ప్రారంభించారు..
- ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్, తండ్రి ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని విస్తృతం చేసి చూపించారు.
- రాష్ట్రంలో పేదరికం 16% నుండి నాలుగు శాతానికి తగ్గింది
- పవన్ పెట్టిన పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించలేదు
- ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు
8:50 AM, Feb 10, 2024
ఎన్డీఏలో చేరడమే టీడీపీకి మరణశాసనం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
- రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీని చంద్రబాబు ఎలా భుజానికెత్తుకుని మోస్తారు
- చంద్రబాబు, లోకేశ్‌లు స్వార్థంతో పదవులు, అధికారం కోసం అవకాశవాదంగా బీజేపీ పంచన చేరారు
- అర్ధరాత్రి అమిత్ షాతో చేసుకున్న చీకటి ఒప్పందాలేమిటో చంద్రబాబు బయట పెట్టాలని డిమాండ్
8:40 AM, Feb 10, 2024
బీజేపీ రాష్ట్రానికి ఏమిస్తానంది ‘బాబూ’: కేవీపీ రామచంద్రరావు
- కొత్తగా ఏం ఒరగబెట్టిందని పొత్తుకు వెంపర్లాట
- పార్టీల పొత్తులు మార్చడంలో నితీష్‌కుమార్‌ను చంద్రబాబు మించిపోయారు
- రాహుల్ గాం«దీపై రాళ్లేయించిన ఘనుడు చంద్రబాబు
- ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బాబు
- 2019లో ధర్మపోరాట దీక్ష ఎందుకు చేశారో, నిన్న అమిత్ షా, జేపీ నడ్డాను కలిసి ఏం అంశాలు చర్చించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి
- ప్రత్యేక హోదా అక్కర్లేదన్న చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు జాతి ప్రయోజనం అంటున్నారు
8:30 AM, Feb 10, 2024
ఏమీ చేయకున్నా.. ఏదో చేసినట్టుగా బాబు బిల్డప్: ఎమ్మెల్సీ పోతుల సునీత
- నిత్యం అబద్ధాల్ని వల్లె వేస్తూ.. ఏమీ చేయకున్నా చేసినట్టు బిల్డప్
- చంద్రబాబును ప్రజలు 2019లోనే తిరస్కరించి మూలనబెట్టారు
- చంద్రబాబు పక్కనున్నోళ్లంతా అభివృద్ధి నిరోధక శక్తులే
- చంద్రబాబు చరిత్ర అంతా అబద్ధాల ప్రపంచమే
- ఈ విషయం చిన్న పిల్లోడిని కదిలించినా చెబుతారు
- చెప్పిన అబద్దాల్నే మళ్లీ మళ్లీ చెబుతుండటం వల్లే టీడీపీ రా.. కదలి రా.. సభలకు ప్రజల స్పందన కరువైంది
- . చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌లు పెత్తందార్లకే ప్రతినిధులు
- పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై పదే పదే విమర్శలు
8:16 AM, Feb 10, 2024
చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడు:మంత్రి మేరుగు
- నీచ రాజకీయాలు చేయడంలోనైనా బాబు సిద్ధహస్తుడు
- అధికారం కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటాడు
- . బీజేపీతో విడిపోయాక ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు అన్న మాటలు బీజేపీ నాయకులు, ప్రజలు ఇంకా మరచిపోలేదు
- మళ్లీ ఆ పారీ్టతో పొత్తు కోసం వెంపర్లాడుతూ అమిత్‌షా కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటు
- అందితే జుట్టు, అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం
8:10 AM, Feb 10 2024
అబద్ధాల ఫ్యాక్టరీ చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి
- ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
- చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో అభివృద్ధి పదేళ్లు వెనక్కి
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేశారు
- చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదు
- చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు కొన్ని పార్టీలతో కలిసి కుయుక్తులు పన్నుతున్నారు
- మహిళలు పూర్తిగా పరిశీలించి ఎవరు మేలు చేశారో తెలుసుకుని ఓట్లు వేయండి
8:00 AM, Feb 10, 2024
టీడీపీ శవ రాజకీయం
- వైఎస్సార్‌సీపీ నేత చంద్రశేఖర్ భౌతికకాయంపై పచ్చజెండా
- మాజీ మంత్రి ఉమా కపట ప్రేమ
- మృతుడి కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ
- మృతిచెందే వరకూ వైఎస్సార్‌సీపీలోనే దేవినేని చంద్రశేఖర్
- 2019 ఎన్నికల్లో తన అన్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఓటమి కోసం మైలవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్‌తో కలసి ఎన్నికలలో క్రియాశీలక పాత్ర
7:00 AM, Feb 10, 2024
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్
- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం
- ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను ఖండించిన సీఐడీ
- ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందన్న సీఐడీ
- ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సీఐడీ
- టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు
- ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీఐడీ
- ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొన్న సీఐడీ
- లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొన్న సీఐడీ
- వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు
- తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధం
6:50 AM, Feb 10, 2024
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పేర్ని నాని కౌంటర్ అటాక్
- బీజేపీతో చంద్రబాబు అర్ధరాత్రి చర్చలు నడిపారు
- 2014లో ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అవసరమన్నాడు
- బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగాడు
- నాలుగేళ్లు కాపురం చేసి చివరి ఆరునెలల్లో బీజేపీ పై చంద్రబాబు బూతులు తిట్టాడు
- మోదీకి భార్యలేదన్నాడు
- కుటుంబం లేనోడు నాతో పోటీనా అన్నాడు
- ఈడీతో బెదిరిస్తావా.. ఏం చేస్తావో చేసుకో అన్నాడు
- బీజేపీతో ఎందుకు కలిసి పోటీచేయాలో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి
- బీజేపీ కొత్తగా ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది
- ప్రత్యేక హోదా ఇచ్చిందా...రైల్వే జోన్ ఇచ్చిందా
- పోర్టు నిర్మాణం పూర్తిచేసిందా ...కడప స్టీల్ ప్లాంట్ కట్టిందాఝ
- పోలవరం పూర్తి చేయించి ఇచ్చిందా
- నిర్వాసితులకు ఈరోజుకీ నయాపైసా ఇవ్వలేదు
- దోసెడు పట్టి.. చెంబుడు నీరు ఇచ్చాడని చంద్రబాబే చెప్పాడు
- అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడు
- ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీలను తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
6:45 AM, Feb 10, 2024
పెందుర్తి సీటు.. నాకంటే నాకు..!
- టీడీపీ, జనసేనల మధ్య టికెట్ వార్
- జనసేనలో బయటపడ్డ తమ్మిరెడ్డి శివశంకర్- పంచకర్ల రమేష్‌బాబు మధ్య ఉన్న విభేదాలు
- జనసేన ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం అందలేదని శివశంకర్ వర్గం నిరసన
- కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తున్నారంటూ కార్యకర్తల ఆగ్రహం
- చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ప్రోటోకాల్ మర్యాదలు తెలియవంటూ అసంతృప్తి
- పెందుర్తి టికెట్ ఆశిస్తున్న రమేష్‌బాబు
- పొత్తులో ఆ టికెట్ జనసేనకు కేటాయిస్తే అది తనకే ఇవ్వాలంటున్న రమేష్‌బాబు
- ఈ మేరకు సోషల్ మీడియా లో ప్రచారం ముమ్మరం
- మరోవైపు రమేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి
- టీడీపీకి ఇస్తే ఆ సీటు నాదే అంటున్న బండారు
- ఒకవేళ జనసేనకు ఇస్తే శివశంకర్‌కు ఇవ్వాలని డిమాండ్
6:30 AM, Feb 10, 2024
ధిక్కార స్వరంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి
- ప్రత్తిపాడులో పైలా వర్గం తిరుగుబాటు
- అధిష్టానం తీరును నిరసిస్తూ మీడియా ముందుకు నెల్లూరు నేతలు
- పెడన నియోజకవర్గంలో ఎవరికివారే యమునాతీరే
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో బీసీలకు స్థానం దక్కలేదు
- జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు పార్టీ పదవులతోనే టీడీపీ సరిపెట్టింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీకి అవకాశం కల్పించలేదు.
- ఉదయగిరిలో జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబుయాదవ్ పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నా, ఆయన పేరునూ పరిగణనలోకి తీసుకోలేదు.
- గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థి దొరకలేదు. దీంతో చివరి నిమిషంలో మై నార్టీ నేత అబ్దుల్ అజీజ్‌కు అవకాశమిచ్చారు. ఆ సీటు పోతుందని తెలిసినా ఆయన బరిలో నిలిచారు. ఆటు పోట్లకు ఎదురొడ్డి నిలిచినా చివరికి మొండిచేయి చూ పారు. వెంకటగిరిలో మస్తాన్‌యాదవ్ కు పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేశారు.
- కావలిలో పసుపులేటి సుధాకర్‌ను నమ్మించి పార్టీ ఫండ్ సేకరించి హ్యాండిచ్చారు. నెల్లూరు పార్లమెంట్ స్థా నానికీ ఇదే తీరు
- వెంకటగిరి సీటు ను బీసీలకే ఇవ్వాలనే డిమాండ్‌తో బీసీ సంఘాలు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment