AP MLC Results: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

AP MLC Election Results 2023 Live Updates - Sakshi

06:00PM

►అనంతపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఆధిక్యత

►పశ్చిమ రాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ముందంజ

►చిత్తూరు: తూర్పు రాయలసీమ టీచర్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ ఫలితాలు

►రెండో రౌండ్‌ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ముందంజ

03:30PM

►అనంతపురం టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆధిక్యత
►తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్న రామచంద్రారెడ్డి

►చిత్తూరు టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ఆధిక్యత
►మొదటిరౌండ్‌లో ముందంజలో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి

9:50 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది.

► పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌,  వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు.

కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి.

► కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌రావు విజయం సాధించారు.

► శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు.

9:40 AM
ఏలూరులో ముందంజ
► ఏలూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయపథంలో దూసుకుపోతోంది. ఇతర స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

9:15 AM
శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ విజయం..
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ 632 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్‌కి 108 ఓట్లే వచ్చాయి.

8:45 AM
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 8 లెక్కింపు కేంద్రాల్లో అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. 

8:00 AM
► ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మూడు గ్రాడ్యుయేట్‌ , రెండు టీచర్‌, నాలుగు స్థానిక సంస్థల నియోజ­క­వర్గాల ఓట్ల లెక్కింపు మొదలైంది. 9 స్థానాలకు మొత్తం 139 అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సాక్షి, అమరావతి/ సాక్షి, తిరుపతి: మార్చి13న ఎన్నికలు జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజ­క­వర్గాలకు పోటీ పడుతున్న 139 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

కౌంటింగ్‌ ప్రారంభానికి అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. 8 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించే విధంగా పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్ల సంఖ్యనుబట్టి టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ పట్టభద్రుల స్థా­నా­నికి 28 టేబుల్స్,  ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల స్థానానికి 40 టేబుల్స్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు కౌంటింగ్‌కు 25 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గానికి 14, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గానికి 15 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు పశి్చమ గోదావరి జిల్లాలోని రెండు స్థానా­లకు 5, శ్రీకాకుళానికి 4, కర్నూలుకు 2 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.  

ఇది సుదీర్ఘ ప్రక్రియని, ఫలితాల ప్రకటనకు రెండు మూడు రోజులు కూడా పట్టే అవకాశం ఉందని మీనా తెలిపారు. సాయంత్రానికి స్థానిక సంస్థల ఫలితాలను, రాత్రికి టీచర్ల నియోజకవర్గ ఫలితాలు వెలువడవచ్చని అంచనా. పట్టభ­ద్రుల నియోజకవర్గాల ఫలితాలకు ప్రకట­న­కు 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉందంటున్నారు. తొలి ఫలితం కర్నూలు స్థానిక సంస్థలది,  చివరగా ప్రకాశం–నెల్లూరు–చి­త్తూరు గ్రాడ్యుయేట్స్‌ ఫలితం వెలువడే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపు నిలిపివేయలేం: హైకోర్టు    
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఫలితాలు మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయాలని కోరుతూ కోడి శ్రీనివాస్‌ బుధవారం వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top