పూటకో రకం మాట్లాడితే ఊరుకోం.. జేసీకి హెచ్చరిక

అమరావతి: జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం చేసే అరాచకాలు తాడిపత్రి ప్రజలకు తెలుసని, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దివాకర్‌రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. అక్రమ మైనింగ్ విషయంలో కోర్టులే జేసీ దివాకర్‌రెడ్డికి అక్షింతలు వేశాయని గుర్తుచేశారు. జేసీ దివాకర్‌రెడ్డి అక్రమ సంపాదన, దౌర్జన్యాలు, హత్యలు అందరికీ తెలుసని చెప్పారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జేసీ దివాకర్‌రెడ్డి పూటకో రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి శంకర్‌నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి అసత్య ఆరోపణలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.70 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్లు మంత్రి శంకర్‌నారాయణ వివరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి