విజయవాడ: జనసేనకు ఊహించని షాక్‌! బీజేపీకిలోకి..

AP Janasena spokesperson Akula Kiran joined BJP - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో విపక్షాల పొత్తులపర్వంపై గందరగోళం నడుస్తోంది. బీజేపీ-జనసేనల చెట్టాపట్టాల్‌పై ఆ పార్టీల నేతలకే స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో దోస్తీ ఉన్నా.. లేనట్లేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండడమూ చూస్తున్నాం. ఈ తరుణంలో జనసేనకు పండగనాడు ఊహించని షాక్‌ తగిలింది. 

జనసేన అధికార ప్రతినిధి ఆకుల కిరణ్ కాషాయం కండువా కప్పుకున్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకాగా, ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరాడు ఆకుల కిరణ్. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top