
గుంటూరు, సాక్షి: ఏపీ హైకోర్టులో కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బుడమేరు వరదలపై చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరదలపై ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయాలేదో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయవాడ బుడమేరు వరదలపై ప్రజలను అప్రమత్తం చేయలేదనే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసుల జారీ చేసే విషయాన్ని తరువాత చూస్తామని హైకోర్టు పేర్కొంది.
చదవండి: ‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే