
చిరంజీవిపై నమోదైన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
సాక్షి, విజయవాడ: చిరంజీవిపై నమోదైన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. 2014 ఎన్నికల్లో ఆయన కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.
చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!